Saturday, March 24, 2012

Srirama Navami on 31 March

31నే శ్రీరామనవమి
ఏప్రిల్ 1న జరపడం అపచారం

శ్రీరామ నవమి నిర్వహణపై మరోసారి వివాదం నెలకొంది. రాముని కల్యాణం ఏప్రిల్ ఒకటో తేదీనే అని భద్రాచలం ఆలయ అధికారులు చెబుతుంటే.. ఆరోజు జరపడం అపచారమని, మార్చి 31వ తేదీనే శ్రీరామనవమి అని శ్రీ శారదా జ్యోతిషాలయ పీఠం సిద్ధాంతి, ఆచార్య ఆర్యసోమయాజుల వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. . "ధర్మశాస్త్ర రీత్యా శ్రీరామ నవమిని ఈనెల 31వ తేదీ శనివారమే జరపాలి.నిర్ణయ సింధు, ధర్మ సింధు, శ్రీవాల్మీకి రామాయణ గ్రంథాల ప్రామాణిక సూత్రాల విశ్లేషణ ప్రకారం సంపూర్ణ పరిశోధన అనంతరం ఈ ప్రకటన చేస్తున్నా. 31వ తేదీన మధ్యాహ్నిక నవమి తిధి, పునర్వసు నక్షత్రం నాడు ధర్మశాస్త్ర రీత్యా సీతారాముల కల్యాణం జరపాలి. భద్రాచలంలో నిర్ణయించిన ఏప్రిల్ ఒకటో తేదీ ఆదివారం మధ్యాహ్నం సమయానికి దశమి తిధి, పుష్యమి నక్షత్రం ఉన్నాయి. అందుకే, ఆరోజు శ్రీరామనవమి చేయకూడదు 

No comments:

Post a Comment